Canada: మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదులకు స్వర్గధామంగా కెనడా

భారత్ ప్రకటించిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులకు కెనడా (Canada) స్వర్గధామంగా మారింది. రాజకీయ లబ్ధి కోసం భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో ముష్కర మూకలకు ఆ దేశం ఊతమిస్తోంది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై అమెరికా చర్యలు తీసుకుంటే సంబరపడుతున్న కెనడా అదే సమయంలో తమ దేశంలో వేర్పాటువాదులను పెంచి పోషిస్తూ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. భారత్ కు చెందిన దౌత్య కార్యాలయాలు, దేవాలయాలు, పౌరులపై దాడులు జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదు. కెనడా తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Published : 22 Sep 2023 16:22 IST
Tags :

మరిన్ని