BJP: భాజపా కార్యాలయం ఎదుట నానో కారు కలకలం

హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా కార్యాలయం ఎదుట రెండ్రోజులుగా కారు పార్కింగ్ చేసి ఉండటం కలకలం రేపింది. నానో కారును గుర్తించిన భాజపా శ్రేణులు.. అనుమానంతో అబిడ్స్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వాహనాన్ని పరిశీలించారు. జాగిలం, బాంబు నిర్వీర్య దళంతో వెళ్లి తనిఖీ చేశారు. ఇంటివద్ద స్థలం లేకపోవడంతో కార్యాలయం ఎదుట పార్క్ చేసినట్లు యజమాని ఫైజాన్  చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

Published : 16 Aug 2022 16:11 IST
Tags :

మరిన్ని