Hyderabad: ఫార్ములా-ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ప్రముఖుల సందడి

ఫార్ములా వన్‌ తర్వాత ఎక్కువ ఆదరణ దక్కించుకుంటున్న ఫార్ములా-ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ హైదరాబాద్‌లో మొదలైంది. ఫార్ములా ఈ కార్‌ రేస్‌ చూసేందుకు నగరవాసులు తరలివస్తున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, క్రికెటర్లు సైతం రేస్‌ను తిలకించేందుకు హైదరాబాద్‌ వచ్చారు. క్రికెటర్లు సచిన్‌ తెందూల్కర్‌, శిఖర్‌ ధావన్, దీపక్‌ హుడా, యజువేంద్ర చాహల్‌, బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ రేస్‌ను తిలకిస్తున్నారు. రాజకీయ ప్రముఖులు మంత్రి కేటీఆర్‌, ఎంపీ సంతోష్‌, ఎంపీ రామ్మెహన్‌ నాయుడు, గల్లా జయదేవ్‌, నటుడు రాంచరణ్‌ హాజరయ్యారు. 

Published : 11 Feb 2023 14:05 IST

మరిన్ని