Politics: భారాస,భాజపా మధ్య మాటల యుద్ధం.. హీటెక్కుతున్న రాష్ట్ర రాజకీయం

కేంద్ర ప్రభుత్వం, భారాస సర్కార్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ఇప్పటికే వివిధ అంశాలపై కేంద్ర, రాష్ట్ర మంత్రుల మధ్య విమర్శలు, సవాళ్లు, లేఖాస్త్రాలు కొనసాగుతుండగా తాజాగా అప్పులు, మెడికల్ కాలేజీల అంశాలు మరింత కాకరాజేశాయి. అసెంబ్లీ వేదికగా కేంద్రంపై సీఎం కేసీఆర్‌ చేసిన విమర్శలను హైదరాబాద్ పర్యటనలో తిప్పికొట్టిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వైద్యకళాశాలలపై రాష్ట్రప్రభుత్వం సరైన ప్రతిపాదనలే పంపలేదన్నారు. 

Updated : 18 Feb 2023 14:49 IST
Tags :

మరిన్ని