Cinema News: అట్టహాసంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం

68వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం దిల్లీలో అట్టహాసంగా జరిగింది. ఈసారి జాతీయ అవార్డుల ఎంపికలో తెలుగు సినిమాలు సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కలర్‌ ఫోటో’ ఎంపికైంది. అలాగే ఉత్తమ కొరియోగ్రఫీ, మేకప్‌ విభాగాల్లో ‘నాట్యం’, ఉత్తమ సంగీత చిత్రం(పాటలు)గా ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు అవార్డులు దక్కించుకున్నాయి. మరోవైపు సూరారైపోట్రు (తెలుగులో ఆకాశం నీ హద్దురా)లో నటనకు గానూ సూర్య, తానాజీలో నటనకు అజయ్‌ దేవగణ్‌లు ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు. అలాగే ఉత్తమ నటిగా అపర్ణా బాలమురళి (సూరారైపోట్రు)ని అవార్డు వరించింది.

Published : 30 Sep 2022 19:00 IST

Tags :

మరిన్ని