Chandrababu: మీరు సినిమాల్లో చేస్తే.. మేం స్టూడెంట్స్‌గా చేశాం: చంద్రబాబు

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వ్యాఖ్యాతగా వ్యహరించిన కార్యక్రమం ‘అన్‌స్టాపబుల్‌’. ఇప్పుడు సీజన్‌ 2తో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ ‘అన్‌స్టాపబుల్‌ 2’ (Unstoppable 2) తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)తో ప్రారంభంకానుంది. సంబంధిత ఎపిసోడ్‌ అక్టోబరు 14న టెలికాస్ట్‌ కాబోతోంది. తాజాగా ప్రోమోను విడుదల చేశారు. స్టూడెంట్స్‌గా రొమాన్స్‌ ఎక్కువే చేశామంటూ చంద్రబాబు సరదాగా ముచ్చటించారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డితో తన స్నేహం గురించి ఆయన పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. లోకేశ్‌ ఎంట్రీతో మరింత సందడి నెలకొంది. 

Published : 12 Oct 2022 13:22 IST

Tags :

మరిన్ని