BCCI: టీమ్‌ఇండియా ఆటగాళ్లపై చేతన్ శర్మ సంచలన వ్యాఖ్యలు..!

బీసీసీఐ(BCCI) చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ పెను వివాదంలో చిక్కుకున్నాడు. మాజీ కెప్టెన్ విరాట్  కోహ్లీతో పాటు టీమిండియా ఆటగాళ్ల గురించి ప్రైవేట్ సంభాషణలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పూర్తి ఫిట్‌గా లేని కొందరు ఆటగాళ్లు ఇంజెక్షన్లు తీసుకుని.. ఫిట్‌నెస్ ఉన్నట్లు చూపించి మ్యాచ్‌లు ఆడుతున్నారని చేతన్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో చేతన్‌పై వేటు పడే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Published : 15 Feb 2023 09:35 IST

మరిన్ని