Pakka Commercial: గోపీచంద్‌ విలక్షణమైన పాత్రలు చేస్తూ ఎదుగుతున్నాడు: చిరంజీవి

‘‘గోపీచంద్‌ తండ్రి టి.కృష్ణ నాకు కాలేజీలో సీనియర్‌. ఆయన ఎప్పుడూ నాకు హీరోలా కనిపించేవారు. అద్భుతమైన దర్శకులు. సినిమాపై ఆయనకున్న ప్రేమని గోపీచంద్‌ కొనసాగిస్తున్నార’’న్నారు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి. ఆయన ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘పక్కా కమర్షియల్‌’ ముందస్తు విడుదల వేడుకకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గోపీచంద్‌, రాశిఖన్నా జంటగా నటించిన చిత్రమిది. మారుతి దర్శకత్వం వహించారు. బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పకులు. జులై 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకని ఉద్దేశించి చిరంజీవి మాట్లాడారు.

Published : 27 Jun 2022 12:07 IST

Tags :

మరిన్ని