‘మార్గదర్శి’ 60వ వార్షికోత్సవం నిర్వహించుకోవడం అతిపెద్ద విజయం: ఎండీ శైలజా కిరణ్‌

మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ శనివారం 60వ వార్షికోత్సవం జరుపుకోవడం అతి పెద్ద విజయమని ఆ సంస్థ MD శైలజా కిరణ్ అన్నారు. వినియోగదారులకు సంస్థ పట్ల ఉన్న నమ్మకానికి ఇదో నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. సరైన డాక్యుమెంటేషన్‌తో ప్రజల డబ్బుకు సంస్థ గార్డియన్‌గా ఉంటుందన్న ఆమె.. ప్రజలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వారి అవసరాల్లో తోడుగా నిలుస్తోందన్నారు. వినియోగదారుల్ని సంతోషంగా ఉంచేందుకు సంస్థ కృషి చేస్తోందన్న ఆమె.. వచ్చే ఏడాదికి రూ. 12 వేల కోట్ల టర్నోవర్ సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు తెలిపారు. మార్గదర్శి వల్ల ఆర్థిక క్రమశిక్షణ అలవడిందని, జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకోగలిగామని వినియోదారులు, ఉద్యోగులు చెబుతున్నారంటూ శైలజా కిరణ్ సంతోషం వ్యక్తం చేశారు.

Updated : 15 Nov 2022 16:17 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని