Dubbaka: దుబ్బాకలో రాజకీయ వేడి.. భారాస - భాజపా శ్రేణుల పోటాపోటీ నినాదాలు

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రాజకీయ వేడి రాజుకుంది. ఆర్టీసీ బస్టాండ్ సహా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు మంత్రులు హరీశ్​రావు, నిరంజన్ రెడ్డి, పువ్వాడ, ప్రశాంత్ రెడ్డిలు దుబ్బాకకు వచ్చారు. భారాస శ్రేణులు పెద్దఎత్తున రావడంతో.. పోటీగా భాజపా కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి, పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. దీంతో మంత్రులు హడావిడిగా కార్యక్రమం పూర్తి చేసుకుని వెళ్లిపోయారు. అయితే, దుబ్బాకలో కొత్త బస్టాండ్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకు రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఉప ఎన్నికలో ఇచ్చిన హామీని నెరవేర్చామని భారాస నేతలు చెబుతుంటే.. తాము ప్రస్తావించడం వల్లే పూర్తయిందని భాజపా నేతలు స్పష్టం చేస్తున్నారు. 

Updated : 30 Dec 2022 16:10 IST

Tags :

మరిన్ని