Uttam : నేను కూడా వంద మందిని తీసుకొచ్చి నినాదాలు ఇప్పించగలను: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం గోదాముల ప్రారంభోత్సవంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే సైదిరెడ్డి అనుచరుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మొదట ఎమ్మెల్యే మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని, హుజూర్ నగర్ అభివృద్ధి పథంలో నడిచిందని చెప్పారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందడం లేదని విమర్శించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లైనా ఇంత వరకు రైతు రుణమాఫీ చేయలేదన్నారు. అంతలోనే ఉత్తమ్ ప్రసంగానికి తెరాస కార్యకర్తలు అడ్డుపడుతూ సైదిరెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. సహనం నశించిన ఉత్తమ్.. తాను కూడా వందమందిని వెంటేసుకుని ఇంతకన్నా ఎక్కువ హంగామా చేయగలనని చెప్పారు. ఇరు వర్గాల అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను సముదాయించి అక్కడి నుంచి పంపించేశారు.

Updated : 26 Nov 2022 17:36 IST

Uttam : నేను కూడా వంద మందిని తీసుకొచ్చి నినాదాలు ఇప్పించగలను: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

మరిన్ని