CM Jagan: సీఎం జగన్‌ భద్రత పేరిట అధికారుల అత్యుత్సాహం..!

ముఖ్యమంత్రి జగన్ భద్రత పేరిట అధికారుల అత్యుత్సాహం ఆగడం లేదు. వైఎస్‌ఆర్‌ ఆసరా మూడో విడత నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా జగన్ ఇవాళ ఏలూరు జిల్లా దెందులూరులో పర్యటించారు. ఈ నేపథ్యంలో సీఎం సభా ప్రాంగణానికి దూరంగా ఉన్న 40 తాటిచెట్లను నరికేశారు. ఆయకట్టు పొలాల నుంచి వచ్చే మురుగునీటిని కొల్లేరుకు తీసుకువెళ్లే ప్రధాన కాలువలను ఐదు ప్రాంతాల్లో పూడ్చివేశారు. సీఎం సభా ప్రాంగణానికి దగ్గరలో ఉన్న వంతెనకు వైకాపా రంగులు పూశారు. 

Published : 25 Mar 2023 13:27 IST

మరిన్ని