CM Jagan: మళ్లీ అదే తంతు.. సీఎం జగన్‌ వస్తున్నారని పచ్చని చెట్లు నరికేశారు!

ముఖ్యమంత్రి పర్యటన (CM Jagan) కోసం కర్నూలు జిల్లా పత్తికొండలో పచ్చని చెట్లు నరికేశారు. జూన్ ఒకటో తేదీన పత్తికొండకు సీఎం జగన్ వస్తున్నారు. సీఎం పర్యటన సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి పాత బస్టాండ్ అంబేడ్కర్ కూడలి వరకు చెట్లు తొలగిస్తున్నారు. కొన్నిచోట్ల కొమ్మలు నరికేశారు. 50 ఏళ్లుగా ఉన్న సుమారు 20 చెట్లును కొట్టేయడంతో.. పాత బస్టాండ్ మార్గం కళ తప్పిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం పర్యటన కోసం భారీ వృక్షాలు తొలగించాల్సిన అవసరమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Published : 30 May 2023 17:48 IST

మరిన్ని