గుంటూరులో సీఎం జగన్‌ పర్యటన.. వాహనదారులకు చుక్కలు!

సీఎం జగన్‌ గుంటూరు పర్యటన నగరవాసులకు చుక్కలు చూపించింది. కీలకమైన మార్గాల్లో రాకపోకలు నిలిపి​వేయడంతో.. ఎటు వెళ్లాలో తెలియక జనం తీవ్ర అవస్థలు పడ్డారు. కలెక్టరేట్, పోలీసు పేరేడ్ గ్రౌండ్స్, చుట్టుగుంట ప్రాంతాల్లో ఆంక్షలు ఉండటంతో.. వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. ఉదయాన్నే ఆఫీసులతో పాటు వివిధ పనులకు బయటకు వెళ్లే వారు ఎక్కడికక్కడ అడ్డుగా పెట్టిన బారికేడ్లతో గందరగోళానికి లోనయ్యారు. వాహనాలను అనుమతించిన మార్గాల్లోనూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఓ వైపు మండుతున్న ఎండలు, మరోవైపు వాహనాల మళ్లింపుతో ప్రజలకు చికాకులు తప్పలేదు.

Published : 02 Jun 2023 15:50 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు