KCR: కొండా లక్ష్మణ్‌ బాపూజీ.. బడుగు, బలహీన వర్గాల చైతన్యానికి ప్రతీక: కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీలేని పోరాటాన్ని నడిపిన కొండా లక్ష్మణ్ బాపూజీ (Konda Laxman Bapuji).. బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR) అన్నారు. ఇవాళ కొండా లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతి సందర్భంగా తెలంగాణకు ఆయన అందించిన సేవలు, చేసిన త్యాగాలను సీఎం స్మరించుకున్నారు. బాపూజీ ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వం తన కార్యాచరణ ద్వారా నెరవేరుస్తోందన్న కేసీఆర్‌.. తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానమే కొండా లక్ష్మణ్ బాపూజీకి నిజమైన నివాళి అని పేర్కొన్నారు.  

Published : 27 Sep 2023 13:09 IST
Tags :

మరిన్ని