KCR: తీరు మార్చుకోకుంటే పోటీపై పునరాలోచన.. ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ హెచ్చరిక!

మూడోసారి అధికార పీఠం కైవసం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్న భారాస (BRS).. అవసరమైతే కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేందుకు సిద్ధమని సంకేతాలు ఇస్తోంది. ఎమ్మెల్యేలు తీరు మార్చుకోకుంటే పోటీపై పునరాలోచన చేయాల్సి ఉంటుందని చెబుతోంది. ఆ జాబితాలో సుమారు 15 మంది నాయకులు ఉండవచ్చని భావిస్తున్నారు. సర్వేలు, నిఘా వర్గాల సమాచారం ఆధారంగా ఆ ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడుతున్న కేసీఆర్ (KCR).. తీరు మార్చుకోవాలని వారికి తుది హెచ్చరికలు జారీచేస్తున్నట్లు సమాచారం.

Updated : 29 May 2023 11:46 IST

మరిన్ని