Visakha Land Scam: విశాఖ భూకుంభకోణంలో సీఎం కార్యాలయ జోక్యం!

విశాఖ భూకుంభకోణంలో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. సాక్షాత్తూ అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయ జోక్యంతోనే  రూ.కోట్ల రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతమైన విషయం బయటికొచ్చింది. అవసరమైన నిరభ్యంతర పత్రాలు జారీ చేయించడంలో సీఎంవో పాత్ర ఎంతో కీలకమని ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చిచెప్పింది. ప్రభుత్వ భూములు అమ్ముకునేందుకు వీలు కల్పించే ఫైళ్లపై సిఫార్సు చేస్తూ నాటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంతకాలు చేయడం, ఆ తర్వాత ఉన్నతస్థాయి వ్యక్తుల ప్రమేయంతో ఎన్‌వోసీల జారీ.. చకచకా సాగిపోయింది. ఇదంతా చూస్తుంటే ఉన్నతస్థాయి ఒత్తిడి ఏ విధంగా పనిచేసిందో అర్థమవుతోంది. 

Published : 26 Nov 2022 13:06 IST

Tags :

మరిన్ని