AP News: వైకాపా ఎంపీ వంగా గీతపై వదిన కళావతి ఫిర్యాదు

కాకినాడ లోక్‌సభ వైకాపా ఎంపీ వంగా గీత (MP Vanga Geetha)పై స్పందన కార్యక్రమంలో ఆమె వదిన కళావతి ఫిర్యాదు చేశారు. 2006లో తన భర్త కృష్ణకుమార్‌తో తమ ఆస్తులను బలవంతంగా రాయించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, వంగా గీత సోదరుడు కృష్ణకుమార్‌ 2010లో మృతి చెందారు. తాజాగా వంగా గీత, ఆమె సోదరి కుసుమకుమారి దంపతులపై కళావతి ఫిర్యాదు చేశారు. తమ పిల్లలు కోర్టులో పోరాడుతుంటే బెదిరిస్తున్నారని కలెక్టర్‌కు విన్నవించారు. ప్రస్తుతం తమ బిడ్డ ఎక్కడ ఉన్నాడో కూడా తెలీయడం లేదన్నారు.

Published : 05 Jun 2023 19:56 IST
Tags :

మరిన్ని