Kamareddy: కాళేశ్వరం పనుల నిలుపుదలపై కాంగ్రెస్ ఆందోళన బాట

కామారెడ్డి జిల్లాలో కాళేశ్వరం పనుల నిలుపుదలపై కాంగ్రెస్ ఆందోళన బాట పట్టింది. మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో సదాశివనగర్ మండలం భూంపల్లి వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. కాళేశ్వరం కింద పేరు మార్చి పనులు చెయ్యక పోవడం పట్ల నిరసన తెలిపారు. ‘ఛలో భూంపల్లి’ పేరుతో రైతులతో కలిసి మాజీ మంత్రి షబ్బీర్ అలీ పనులను పరిశీలించారు. కాంగ్రెస్ హయాంలో ప్రాణహిత-చేవెళ్ల కింద చేసిన పనులు తప్ప.. కాళేశ్వరం కింద చేసిన పనులు శూన్యమని షబ్బీర్ అలీ అన్నారు. సంబరాలు చేస్తున్న ప్రభుత్వానికి రైతుల ఇబ్బందులు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 08 Jun 2023 20:40 IST

మరిన్ని