JanaReddy: భారాసతో కాంగ్రెస్‌ పొత్తు.. ప్రజలే నిర్ణయిస్తారు: జానారెడ్డి

అదానీ - మోదీ సంబంధాలపై రాహుల్ ప్రశ్నించకుండా ఉండేందుకే.. అనర్హత వేటు వేశారని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి (Jana Reddy) ఆరోపించారు. పెట్టుబడి దారులకు కొమ్ము కాస్తున్న మోదీ పాలనకు వ్యతిరేకంగా.. భారాస, శివసేన సహా 17 పార్టీలు ఆందోళన చేస్తున్నాయని వివరించారు. ఈ మేరకు వచ్చే శ్రీరామ నవమి లోపు భాజపాకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. భాజపాపై పోరుకు ఎన్నికలకు సంబంధం లేదని జానారెడ్డి వివరించారు. భారాసతో పొత్తు అనేది.. ఎన్నికలు వచ్చినప్పుడు.. తప్పదు అనుకున్నప్పుడు ప్రజలే నిర్ణయిస్తారన్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు కూడా పోటీ చేస్తారని క్లారిటీ ఇచ్చారు.

Published : 31 Mar 2023 15:34 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు