Munugode bypoll: మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ

మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్‌కు కోలుకోలేని విధంగా ఎదురుదెబ్బ తగిలింది. సిట్టింగ్ స్థానాన్ని చేజార్చుకోవడమే కాకుండా.. ధరావతు కోల్పోయింది. తెరాస, భాజపాలకు దరిదాపుల్లో నిలువలేకపోయింది. స్థానిక కాంగ్రెస్  నాయకులు పెద్దఎత్తున ప్రలోభాలకు లోనుకావడం, ప్రత్యర్థి పార్టీల స్థాయిలో బలం చూపకపోవడంతో ఓటమి మూటకట్టుకుంది. రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర పేరిట కొందరు సీనియర్లు ప్రచారానికి దూరం కావడం కూడా ప్రభావం చూపింది. మునుగోడు ఫలితంపై పూర్తిస్థాయిలో సమీక్ష చేసుకుని ముందుకెళ్తామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.

Published : 07 Nov 2022 09:39 IST
Tags :

మరిన్ని