Uttam: రాష్ట్రపతి పాలనలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: ఉత్తమ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణలో ఈ నెలాఖరు లోపు శాసనసభ రద్దై.. ముందస్తు ఎన్నికలు రాష్ట్రపతి పాలనలో జరుగుతాయని నల్గొండ కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి (Uttam Kumar Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణలో ముందస్తు ఎన్నికలను రాష్ట్రపతి పాలనలో జరపాలని చర్చించబోతున్నట్లు తెలిపారు. కోదాడలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కోదాడ, హుజుర్‌నగర్‌లో కాంగ్రెస్‌కు 50వేల మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాను చెప్పిన మెజార్టీ రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్‌ విసిరారు. 

Published : 05 Feb 2023 19:05 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు