Congress: ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకే ‘హాథ్ సే హాథ్ జోడో’ యాత్ర: కాంగ్రెస్‌

హాథ్ సే హాథ్ జోడో యాత్రను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్(Congress).. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు వేదికగా ఎంచుకుంది. ఏఐసీసీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని పార్టీ బలోపేతం, భారాస సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను జనంలోకి తీసుకెళ్లేందుకు సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. రెండు నెలలపాటు కొనసాగనున్న ఈ యాత్రలో వారానికి ఒక సమస్యపై ఛార్జిషీట్ విడుదల చేస్తూ క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. 

Published : 01 Feb 2023 10:59 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు