Connect: ఓ అమ్మాయి చేసిన పని ఇంటిల్లిపాదికి ప్రమాదమైతే..

వివాహం తర్వాత నయనతార (Nayanthara) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కనెక్ట్‌’. అశ్విన్‌ శరవణన్‌ దర్శకుడు. సత్యరాజ్‌, అనుపమ్‌ ఖేర్‌ కీలకపాత్రలు పోషించారు. కోలీవుడ్‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ వారు తెలుగులో విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను ప్రభాస్‌ విడుదల చేశారు. ఎలాంటి విరామం లేకుండా ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది. హారర్‌ నేపథ్యంలో సాగిన ఈ ట్రైలర్‌ భయపెట్టేలా ఉందని సినీ ప్రియులు అంటున్నారు.

Published : 09 Dec 2022 10:51 IST

Tags :

మరిన్ని