David Warner: ‘డీజే టిల్లు’ గెటప్‌లో.. వార్నర్‌ స్టైలే వేరు..!

తెలుగు సినిమా హీరోల స్టైల్‌ను అనుకరిస్తూ ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ పోస్ట్‌ చేసే ఫన్నీ వీడియోల గురించి అందరికీ తెలిసిందే. బాహుబలి, పుష్ప లాంటి ఫేమస్‌ గెటప్స్‌లో తన ముఖం కనిపించేలా ఒరిజినల్‌ వీడియోలను మార్ఫింగ్‌ చేసి.. సరదాగా సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తుంటారాయన. తాజాగా ఆయన ‘డీజే టిల్లు’ అవతారమెత్తారు. ఆ సినిమాలో ఓ సీన్‌ను మార్ఫింగ్‌ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. తాజాగా ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. 

Updated : 14 Nov 2022 20:40 IST

Tags :

మరిన్ని