Cyclone Asani: ‘అసని’ ప్రభావం.. తీరానికి కొట్టుకొచ్చిన మందిరం!

అసని తీవ్ర తుపాను ప్రభావంతో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. అలల తీవత్రతకు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం సున్నాపల్లి సముద్ర తీరానికి ఓ మందిరం కొట్టుకొచ్చింది. గమనించిన స్థానికులు తాళ్ళతో కట్టి ఒడ్డుకు చేర్చారు. విషయం తెలుసుకున్న మెరైన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అది ఎక్కడి నుంచి కొట్టుకొచ్చిందనే విషయం ఇంకా తెలియరాలేదు.

Published : 10 May 2022 20:01 IST

Tags :

మరిన్ని