Mahesh babu: నాన్న చాలా ఇచ్చారు.. అందులో గొప్పది మీ ప్రేమే: మహేశ్‌బాబు

నాన్న తనకు చాలా ఇచ్చారని.. ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటానని నటుడు మహేశ్‌ బాబు పేర్కొన్నారు.  ఇటీవల మృతి చెందిన సూపర్‌స్టార్‌ కృష్ణ పెద్దకర్మను ఆదివారం కుటుంబ సభ్యుల మధ్య నిర్వహించారు. పెద్దకర్మకు హాజరైన అభిమానులకు భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహేశ్‌ మాట్లాడుతూ.. ‘నాన్న ఎల్లప్పుడూ మన గుండెల్లోనే, మన మధ్యే ఉంటారు. మీరందరూ ఇక్కడకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ అభిమానం, ఆశీస్సులు నాపై ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ భావోద్వేగంగా ప్రసంగించారు. నమ్రత, మంజుల, సుధీర్‌బాబు తదితరులు కృష్ణ చిత్రపటానికి నివాళి అర్పించారు.  

Updated : 27 Nov 2022 17:17 IST

మరిన్ని