Bharat Biotech: భారత్‌ బయోటెక్‌ నాసల్‌ వ్యాక్సిన్‌కి డీసీజీఐ అనుమతి

కొవిడ్‌ నుంచి రక్షణ కల్పించేందుకు భారత్‌ బయోటెక్‌ రూపొందించిన ముక్కు ద్వారా ఇచ్చే చుక్కల మందుకు (నాసల్‌ వ్యాక్సిన్‌) అత్యవసర వినియోగ అనుమతి లభించింది. ఈ మేరకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా  (డీసీజీఐ) అనుమతి ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. 18 ఏళ్లు పైబడిన వారికి ఈ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు అత్యవసర అనుమతులు మంజూరైనట్లు తెలిపారు. 

Published : 06 Sep 2022 16:18 IST

Tags :

మరిన్ని