Ravi Teja: ‘వీడు ల్యాండ్‌మైన్‌ లెక్క..’ మరో ‘ధమాకా’ పాట

రవితేజ కథానాయకుడిగా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ధమాకా’. డబుల్‌ ఇంపాక్ట్‌.. అనేది ఉపశీర్షిక. శ్రీలీల కథానాయిక. డిసెంబర్‌ 23న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు మంచి ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ‘ధమాకా’ నుంచి మరో కొత్త పాట వచ్చేసింది. ‘డు.. డు..’ అంటే సాగే ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. పృథ్వి చంద్ర ఆలపించారు. భీమ్స్‌ సిసిరోలియో మ్యూజిక్‌ డైరెక్టర్‌.  

Updated : 25 Nov 2022 19:12 IST
Tags :

మరిన్ని