Dhamaka: వాట్స్‌ హ్యాపెనింగ్‌.. ‘ధమాకా’ నుంచి కొత్త పాట వచ్చేసింది

రవితేజ కథానాయకుడిగా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ధమాకా’. డబుల్‌ ఇంపాక్ట్‌.. అనేది ఉపశీర్షిక. శ్రీలీల కథానాయిక. ఇప్పటికే ‘ధమాకా’ నుంచి విడుదలైన ‘జింతాక్‌’ పాట, టీజర్‌ విపరీతంగా ఆకట్టుకోగా.. తాజాగా చిత్ర బృందం మరో పాటను వదిలింది. ‘వాట్స్‌ హ్యాపెనింగ్‌..’ అంటూ సాగే ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, భీమ్స్‌ సిసిరోలియో స్వరాలు సమకూర్చారు. రమ్య బెహరా, భార్గవి పిళ్లై ఆలపించారు. 

Updated : 11 Nov 2022 20:06 IST
Tags :

మరిన్ని