CSK vs GT: ఉత్కంఠతో కళ్లుమూసుకుని.. ఆనందపరవశుడై జడేజాను ఎత్తుకున్న ధోనీ

అహ్మదాబాద్‌: ఐపీఎల్-16వ సీజన్‌ ఫైనల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ అదరగొట్టింది. డిఫెండింగ్‌ ఛాంపియన్ గుజరాత్‌ను ఓడించి ఐదోసారి టైటిల్‌ విజేతగా అవతరించింది. చివరి రెండు బంతులను జడేజా సిక్స్‌, ఫోర్‌గా మలచడంతో చెన్నై శిబిరం సంబరాల్లో మునిగితేలింది. మరోవైపు ఎంత పెద్ద విజయమైనా, ఘోర పరాజయమైనా కూల్‌గా ఉండే ధోనీ  ఎలాంటి భావోద్వేగాలు ప్రదర్శించడు. అయితే ఈ మ్యాచ్‌లో ధోనీ కాస్త ఉద్వేగానికి లోనైట్లు అనిపించిది. చివరి రెండు బంతుల సమయంలో కళ్లు మూసుకుని ఉండడం కెమెరాల్లో కనిపించింది. జడేజా తనదైన ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను గెలిపించడంతో ధోనీ సంతోషానికి హద్దుల్లేకుండా పోయాయి.  జడేజాను ఆనందంతో హత్తుకొని ఎత్తుకున్నాడు. దీంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఇంకెందుకు ఆలస్యం మీరూ చూసేయండి..  

Updated : 30 May 2023 05:14 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు