T Congress: గాంధీభవన్‌లో పరస్పర భేటీలు.. నేతలకు దిగ్విజయ్‌ క్లాస్‌!

తెలంగాణ కాంగ్రెస్‌లో సంక్షోభాన్ని తెరదించేందుకు రంగంలోకి దిగిన.. సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ గాంధీభవన్‌లో రాష్ట్ర నేతలతో సమావేశమయ్యారు. ఒక్కొక్కరితో వేర్వేరుగా చర్చిస్తున్న ఆయన.. నేతలకు క్లాస్‌ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్టీలో జూనియర్, సీనియర్ పంచాయతీ మంచిది కాదని.. ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే హైకమాండ్ చూస్తూ ఊరుకోదని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ‘పార్టీ బలోపేతం కోసం మీ పాత్ర ఏంటి? మీరు ఏం చేశారు?అంతర్గత సమస్యపై మీ అభిప్రాయం.. పరిష్కారం కోసం మీ సలహా ఏంటి?’ వంటి ప్రశ్నలకు జవాబు అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు దిగ్విజయతో భేటీ అయిన నేతలు సమస్యలన్నీ సర్దుకుంటాయని చెబుతున్నారు తప్పితే.. ఇప్పుడేం మాట్లాడలేమని పేర్కొంటున్నారు.

Published : 22 Dec 2022 17:04 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు