Manchu Vishnu Dilraju: మంచు విష్ణుని కలిసిన దిల్‌రాజు

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణును గురువారం ఉదయం ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత దిల్‌రాజు కలిశారు. మంచు విష్ణు కార్యాలయానికి వెళ్లిన దిల్‌రాజు ఆయనతో కొద్దిసేపు సమావేశమయ్యారు. తమ సినిమాల్లో ‘మా’ సభ్యులకు ఎక్కువగా అవకాశాలు కల్పించాలని, అలాగే, కొత్తవారు ‘మా’లో భాగమయ్యేలా  ప్రోత్సహించాలని దిల్‌ రాజుని విష్ణు కోరారు. 

Published : 04 Aug 2022 17:52 IST

Tags :

మరిన్ని