Telangana University: యాదగిరి vs కనకయ్య.. ఇంతకీ TUలో రిజిస్ట్రార్‌ ఎవరు?

తెలంగాణ వర్సిటీ (Telangana University)లో రిజిస్ట్రార్ నియామకంపై వివాదం చల్లారడం లేదు. పాలకవర్గం (ఈసీ) నియమించిన రిజిస్ట్రార్, వీసీ నియమించిన వ్యక్తి మధ్య పోటాపోటీ నెలకొంది. కుర్చీ కొట్లాటతో.. అసలు రిజిస్టార్ ఎవరనే అంశంపై స్పష్టత లేకుండా పోయింది. ఇటీవలే వర్సిటీ వీసీ.. రిజిస్ట్రార్‌గా కనకయ్యను నియమించగా, ఇవాళ మరోసారి వ్యవహారం రచ్చకెక్కింది. ఈసీ నియమించిన యాదగిరి వచ్చి ముందుగా కుర్చీలో కూర్చున్నారు. ఆ తర్వాత వచ్చిన వీసీ నియమించిన కనకయ్య.. సీటులో కూర్చునేందుకు ప్రయత్నించారు. దీంతో కుర్చీ కోసం యాదగిరి, కనకయ్య మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Published : 29 May 2023 20:18 IST
Tags :

మరిన్ని