Drone Show: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు.. ఆకట్టుకున్న డ్రోన్‌ షో

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో (Telangana Formation Decade) భాగంగా ఏర్పాటు చేసిన లేజర్, డ్రోన్ షో (Drone Show)లు ఆకట్టుకున్నాయి. దుర్గం చెరువు సమీపంలోని తీగెల వంతెన వద్ద రాత్రి 8:45 గంటలకు ఏర్పాటు చేసిన లేజర్ షో ఆకట్టుకుంది. అనంతరం ఏర్పాటు చేసిన డ్రోన్ అద్యంతం అద్భుతంగా కొనసాగింది. సుమారు 15 నిమిషాల పాటు కొనసాగిన షోలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల చిహ్నాలతో డ్రోన్లు ఆకాశంలో చక్కర్లు కొడుతూ కనువిందు చేశాయి. డ్రోన్ షో చూసేందుకు నగరవాసులు తీగల వంతన వద్దకు భారీగా తరలివచ్చారు. 

Published : 05 Jun 2023 11:11 IST
Tags :

మరిన్ని