Eatala: దేశాన్ని ఎవరు అమ్ముకున్నారో.. ఎవరు కాపాడారో చర్చకు సిద్ధమా?: ఈటల సవాల్‌

ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను భాజపా (BJP) ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ (Eatala Rajender) తీవ్రంగా ఖండించారు. దేశాన్ని ఎవరు అమ్ముకున్నారో, దేశ ప్రతిష్ట ఎవరు కాపాడారో చర్చకు సిద్ధమా అని కేటీఆర్‌కు సవాల్ విసిరారు. మహబూబాబాద్‌లో జరిగిన భాజపా బూత్ మేళా కార్యక్రమంలో మాట్లాడిన ఈటల.. కరోనా కష్టకాలంలో ఆసుపత్రుల్లో పని చేసిన శానిటేషన్ శ్రామికుల కాళ్లు కడిగి నెత్తిన పోసుకున్న బిడ్డ నరేంద్ర మోదీ అని పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా భారతీయులు గల్లా ఎగుర వేసుకునే పరిస్థితి నరేంద్ర మోదీ పాలనలో వచ్చిందని ఈటల పేర్కొన్నారు.  

Published : 23 Sep 2023 14:12 IST
Tags :

మరిన్ని