Andhra News: విశాఖ భూ కుంభకోణంలో 8 మంది ఐఏఎస్‌లు.. సిట్‌ నివేదికలో వెల్లడి!

అత్యున్నత స్థాయిలో పోటీపడి.. అఖిలభారత స్థాయిలో లక్షల్లో ఒకరిగా ఎంపికైన ఐఏఎస్ అధికారులు.. ప్రభుత్వ ఆస్తుల్ని కాజేసేవారికి కొమ్ముకాశారు. అవసరమైన పత్రాలు లేకపోయినా, నిబంధనలు అంగీకరించకపోయినా, అసైన్డ్ భూమలు అమ్ముకోవడానికి ఎన్‌వోసీలు ఇచ్చేశారు. ముఖ్యంగా మాజీ సైనికుల పేరిట జరిగిన పలు ఎసైన్డ్ భూముల అక్రమాల్లో వీరంతా పాలుపంచుకున్నారని.. విశాఖలో భూ అక్రమాలపై విచారణ కోసం 2017లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చింది. అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రమేయంతో పలువురు ఐఏఎస్ అధికారులు ఈ భూ కుంభకోణాల్లో భాగస్వాములయ్యారని పేర్కొంది.   ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు మాత్రం.. కింది స్థాయి అధికారుల నుంచి అందిన నివేదికల ఆధారంగానే తాము చర్యలు తీసుకున్నామంటూ సిట్‌కు సమాధానమిచ్చారు. 

Published : 30 Oct 2022 12:17 IST

Tags :

మరిన్ని