Twitter: ఇక గోల్డ్, గ్రే, బ్లూ రంగుల్లో ట్విటర్ టిక్‌ మార్క్‌

ట్విటర్ బ్లూ టిక్ చందా సేవలు డిసెంబర్ 2వ తేదీ నుంచి మళ్లీ అందుబాటులోకి రానున్నాయి. అయితే, వెరిఫైడ్ ఖాతాలకు వేర్వేరు రంగుల్లో ఈ టిక్ మార్క్‌లను కేటాయించనున్నట్లు ఎలాన్ మస్క్ వెల్లడించారు. గోల్డ్, గ్రే, బ్లూ రంగుల్లో ఇవి దర్శనమివ్వనున్నాయి. వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వ ఖాతాలకు స్పష్టమైన తేడా ఉండేలా ఈ బ్యాడ్జ్‌లను ఇవ్వనున్నారు.

Published : 25 Nov 2022 19:17 IST

Tags :

మరిన్ని