Tesla: టెస్లా షేర్లను విక్రయించిన ఎలాన్ మస్క్

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరో 3.58 బిలియన్ డాలర్ల విలువైన టెస్లా షేర్లను విక్రయించారు. అందుకు గల కారణాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఏప్రిల్‌లో ట్విటర్‌ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించినప్పటి నుంచి 23 బిలియన్ డాలర్ల విలువైన టెస్లా షేర్లను మస్క్ విక్రయించారు. తాజా అమ్మకంతో టెస్లా షేర్ విలువ మరింత పడిపోయింది. ఇప్పటికే ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుల్లో నంబర్ -1 స్థానం నుంచి నంబర్ -2కి పడిపోయారు. టెస్లా వాటాదార్లకు మస్క్ ఓ విలన్‌గా కనిపిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Updated : 25 May 2023 15:08 IST

Tags :

మరిన్ని