Twitter: ఇలాంటి బాధ మరొకరికి రావొద్దు: ఎలాన్‌ మస్క్‌

ఆర్థిక కష్టాల్లో ఉన్న ట్విటర్‌ను గట్టెక్కించటంపైనే దృష్టిని కేంద్రీకరించిన ఎలాన్‌ మస్క్‌.. తాను ఎదుర్కొన్న ఇబ్బందుల్ని పంచుకున్నారు. ట్విటర్‌ను కొనుగోలు చేసిన తరువాత మూడు నెలలు చాలా కఠినంగా గడిచాయని తెలిపారు. దివాళా ముప్పు నుంచి ట్విటర్‌ను రక్షించేందుకు చాలా శ్రమించాల్సి వచ్చిందంటూ తన బాధలు తెలియజేశారు. మరో వైపు తన నేతృత్వంలోని కీలక సంస్థలైన టెస్లా, స్పేస్‌ఎక్స్‌ కార్యకలాపాలను కూడా పర్యవేక్షిస్తూ తీరిక లేకుండా గడుపుతున్నట్లు ఎలాన్‌ మస్క్‌ తెలిపారు.

Published : 06 Feb 2023 17:07 IST
Tags :

మరిన్ని