Chinnareddy: ఆ విగ్రహం మీద చెయ్యేస్తే.. తుపాకీతో కాల్చేస్తా!: చిన్నారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

వనపర్తిలో చేపట్టిన రహదారి విస్తరణలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించాలని చూస్తే తుపాకీతో కాల్చేస్తాని మాజీ మంత్రి చిన్నారెడ్డి (ChinnaReddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వనపర్తిలో రోడ్డు విస్తరణ సందర్భంగా పాతబజార్ లోని దర్గా, ఓ ఆలయ స్వాగత తోరణం తొలగించినందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కూడళ్లలో జాతీయ నాయకుల విగ్రహాలను తొలగించాలని చూడటం ఎంతవరకు సమంజసమని చిన్నారెడ్డి ప్రశ్నించారు. భారాస నాయకులు అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది.

Updated : 29 May 2023 11:10 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు