AP News: రాయలసీమకు సీఎం జగన్ మరోసారి అన్యాయం చేస్తున్నారు: టీజీ వెంకటేష్

మూడు రాజధానుల పేరుతో ప్రజల మధ్య సీఎం జగన్(CM Jagan) చిచ్చు పెట్టే కుట్ర చేస్తున్నారని మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్(TG Venkatesh) ఆరోపించారు. కర్నూలులోని వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. జగన్ మరోసారి రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీమ ప్రజలకు అమరావతే దూరం అవుతుందంటే.. విశాఖ మరింత దూరమతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై జగన్ ఏమీ మాట్లాడకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. దీని వల్ల రాష్ట్రం ముక్కలయ్యే ప్రమాదం ఉందన్నారు.

Published : 01 Feb 2023 15:50 IST

మరిన్ని