Revanth Reddy: రేవంత్‌ రెడ్డికి సద్ది కలిపి పెట్టిన రైతు కూలీలు

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన ‘హాథ్ సే హాథ్ జోడో’ యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. మంగళవారం రామప్ప ఆలయాన్ని సందర్శించిన రేవంత్‌.. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యాత్రలో భాగంగా కేశపూర్‌లో వరి, మిర్చి తోటలో మహిళా కూలీలతో మాట్లాడి.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్‌, ఎమ్మెల్యే సీతక్క, మల్లు రవిలకు కూలీలు వారి సద్ది కలిపి ముద్దలు పెట్టారు. వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని.. పేదలందరికీ ఇళ్ల నిర్మాణానికి ఒక్కొక్కరికి రూ.5 లక్షలు మంజూరు చేస్తామని రేవంత్‌ హామీ ఇచ్చారు.

Published : 07 Feb 2023 17:26 IST

మరిన్ని