Amaravati: తుళ్లూరులో ఉద్రిక్తత.. పోలీసులు, రైతులకు మధ్య వాగ్వాదం

తుళ్లూరులో ఉద్రిక్తత నెలకొంది. ఆర్‌-5 జోన్‌ (R5 Zone) పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీకి వ్యతిరేకంగా.. రాజధాని రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో తుళ్లూరులో శిబిరం నుంచి బయటకొచ్చిన రైతులు.. సీఎం గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు అదే మార్గంలో పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు కారు రావడంతో అమరావతి రైతులు అడ్డుకునేందుకు యత్నించారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి అక్కడ ఉద్రిక్తంగా మారింది.

Updated : 26 May 2023 14:25 IST

మరిన్ని