Crime News: ఇద్దరు పిల్లలను బావిలో తోసి.. తండ్రి ఆత్మహత్య

జగిత్యాల జిల్లాలో విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు చిన్నారులను బావిలో తోసి ఓ తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నర్సింగాపూర్ గ్రామానికి చెందిన జలపతిరెడ్డికి భార్య, ముగ్గురు ఆడపిల్లలున్నారు. నిన్న శుభకార్యానికి వెళ్తున్నానంటూ ఇద్దరు పిల్లలు ప్రణిత, మధుమితను తీసుకుని వెళ్లిన జలపతిరెడ్డి సాయంత్రం తిరిగి రాలేదు. ఉదయం గ్రామశివారులోని వ్యవసాయపొలం వద్ద విగతజీవిగా పడి ఉన్న జలపతిరెడ్డిని స్థానికులు గుర్తించారు. తండ్రి మృతదేహం మాత్రమే ఉండగా ఇద్దరు పిల్లల జాడ దొరకలేదు. 

Published : 04 Feb 2023 19:17 IST

మరిన్ని