Nellore: ‘మా నాన్నను కాపాడండి సార్‌..’ చిన్నారి వేడుకోలు

క్యాన్సర్ వ్యాధి సోకిన మా నాన్నను బతికించమంటూ ఆ చిన్నారి వేడుకుంటున్న దృశ్యాలు అందరినీ కలిచివేశాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరుకి చెందిన అల్లాబక్షు, షాకిర దంపతులకి ముగ్గురు పిల్లలు. రోజు వారి కూలి పనిచేసుకుంటూ.. అద్దె ఇంట్లో జీవిస్తున్న వారి కుటుంబాన్ని క్యాన్సర్ భూతం భయపెడుతోంది. అల్లాబక్షుకు క్యాన్సర్ మెుదటిదశలో ఉందని డాక్టర్‌లు తెలిపారు. భర్త మంచాన పడటంతో ముగ్గురు పిల్లలతో పూట గడవటం కష్టంగా మారిందని షాకిర ఆవేదన వ్యక్తం చేస్తోంది.

Published : 10 Jan 2023 18:24 IST
Tags :

మరిన్ని