Amaravati: అక్కడ అందరి లక్ష్యం ఒక్కటే..!

అమరావతిని కాపాడుకోవటమే అక్కడ అందరి లక్ష్యం. వైకాపా తప్ప అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, అమరావతి నిర్మాణానికి భూసమీకరణలో భూములిచ్చిన రాజధాని గ్రామాల రైతులు, ప్రజలు అలుపెరగకుండా చేస్తున్న ఈ పోరాటం మొదలై 1000 రోజులైంది. భూములిచ్చిన రైతులు, రైతు కూలీల ఐక్య కార్యాచరణ సమితి, వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులతో ఏర్పడిన అమరావతి పరిరక్షణ సమితి.. 3ఏళ్ల నుంచి అకుంఠిత దీక్షతో పోరాడుతూనే ఉన్నాయి. గోడు వెళ్లబోసుకోవడానికి కనిపించిన ఏ మార్గాన్నీ వదులుకోలేదు. మరి ఇప్పుడైనా రాష్ట్రప్రభుత్వం వారి మొర ఆలకిస్తుందా..?

Published : 11 Sep 2022 22:45 IST

Tags :

మరిన్ని