Hema: ఆ అసత్య ప్రచారం తగదు: ‘సైబర్‌ క్రైమ్‌’లో సినీనటి హేమ ఫిర్యాదు

సెలబ్రిటీలను టార్గెట్‌ చేస్తూ కొన్ని యూట్యూబ్‌ ఛానెళ్లు అసత్య ప్రచారం చేయడంపై సినీనటి హేమ (Hema) మండిపడ్డారు. ఈ మేరకు యూట్యూబ్‌ ఛానెళ్లపై ఆమె సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మూడేళ్ల క్రితం వివాహ వార్షికోత్సంలో తన భర్తతో ఉన్న ఫొటోలు, వీడియోను ఇప్పుడు మరోసారి పోస్టు చేసి.. ఫేక్‌ థంబ్‌ నైల్స్‌ పెట్టి అసత్య ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పాటు ఇటీవల కొంత మంది సెలబ్రిటీలు చనిపోయారని దుష్ప్రచారం చేయడంపై కూడా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Published : 21 Mar 2023 19:48 IST

మరిన్ని