Fire Accident: హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని కట్టెల గోదాంలో భారీ అగ్నిప్రమాదం..

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని కట్టెల గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎక్కువ మొత్తంలో కట్టెలు నిల్వ ఉండటంతో పెద్ద ఎత్తున మంటలు  చెలరేగాయి. అదృష్టవశాత్తు ప్రమాదం జరిగిన సమయంలో గోదాంలో ఎవరూ లేకపోవడంతో పెను ముప్పు తప్పింది. అగ్నిమాపక సిబ్బంది 8 శకటాలతో సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. కట్టెల గోదాంలో ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. 

Published : 13 Mar 2023 07:20 IST

Fire Accident: హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని కట్టెల గోదాంలో భారీ అగ్నిప్రమాదం..

Tags :

మరిన్ని