Fire Accident: సంగారెడ్డి జిల్లా.. రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

జిన్నారం: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని లీ ఫార్మా(lee) భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 10 గంటల ప్రాంతంలో పరిశ్రమ ఆవరణలోని కాల్వెంట్‌ డ్రమ్‌ యార్డులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. మంటలు ఒక్కసారిగా రావడంతో కార్మికులు అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు.  ప్రమాదంలో కొంతమంది కార్మికులు గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను అంబులెన్సులో హైదారాబాద్‌లోని ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. వివిధ పరిశ్రమల నుంచి వచ్చిన అగ్రిమాపక ప్రత్యేక దళాలు మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. 4 ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు.

Updated : 08 Feb 2023 14:04 IST

Fire Accident: సంగారెడ్డి జిల్లా.. రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు